Skip to main content

Namaste NRI

అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల మోత

 అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూ హాంప్‌షైర్‌లోని కాంకర్డ్‌లో ఉన్న ఓ సైకియాట్రిక్‌ దవాఖానలోకి చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దవాఖాన సమీపంలో దుండగుడు వినియోగించిన వాహనాన్ని గుర్తించామన్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగిందని హాంప్‌షైర్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. కాగా, ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనే విషయం ఇంకా తెలియరాలేదని, వారి పరిస్థితి ఎలా ఉందనే విషయమై సరైన సమాచారం లేదన్నారు.  పోలీసుల కాల్పుల్లో అనుమనితుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.

Social Share Spread Message

Latest News