Skip to main content

Namaste NRI

మా ఎంపిక సరైనదే.. సమర్థించుకున్న చైనా

గల్వాన్‌ లోయలో భారత సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రమేయమున్న పీఎల్‌ఏ కర్నల్‌ క్వీ ఫాబోవాను వింటర్‌ ఒలింపిక్స్‌ టార్చ్‌బేరర్‌గా నియమించడాన్ని చైనా సమర్థించుకుంది. ఇందులో రాజకీయ దురుద్దేశమేమీ లేదని చైనా విదేశాంగ ప్రతినిధి రaావో లిజియన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాణాలకు అనుగుణంగానే వింటర్‌ ఒలింపిక్స్‌లో కర్నల్‌ క్వీ ఫాబోవాను టార్చ్‌బేరర్‌గా నియమించాం. దీనిపై అనవసర రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అంటూ  లిజియోన్‌ స్పష్టం చేశారు.  దీనికి నిరసనగా వింటర్‌ ఒలంపిక్స్‌ ఆరంభోత్సవాలను భారత్‌ బహిష్కరించింది. అమెరికా సైతం చైనా చర్యను తప్పుబట్టింది. అయితే ఇది కేవలం ముందుగా అనుకున్న ప్రమాణాలకు లోబడి తీసుకున్న నిర్ణయమని చైనా విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి రaావో లిజియన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో స్పందించిన చైనా దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

Social Share Spread Message

Latest News