Skip to main content

Namaste NRI

భద్రతా మండలి నుంచి పాకిస్తాన్ ఔట్.. మరో ఐదు దేశాలకు చోటు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి పాకిస్తాన్ వైదొలగనుంది. భద్రతా మండలిలో పాకిస్తాన్ సభ్యత్వం ఈ ఏడాదితో ముగియనుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి తాత్కాలిక సభ్య దేశాలకు సంబంధించిన ఓటింగ్ ఈ నెల 3న జరిగింది. దీని ప్రకారం పాకిస్తాన్ సహా ఐదు దేశాలు తమ సభ్యత్వం కోల్పోనున్నాయి. మరో ఐదు దేశాలు కొత్తగా అడుగుపెట్టబోతున్నాయి. అందులో ఇస్లాం దేశమైన కిర్గిస్తాన్, భద్రతా మండలిలోకి తొలిసారి అడుగుపెట్టబోతుంది. దీనితోపాటు ఆస్ట్రియా, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వేలు రెండేళ్ల కాలపరిమితితో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం దక్కించుకున్నాయి.

పాకిస్తాన్ సభ్యత్వం ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది. దీంతో భద్రతా మండలిలో ఈ దేశానికి ఇకపై ప్రాతినిధ్యం ఉండదు. పాక్‌తోపాటు పనామా, డెన్మార్క్, గ్రీస్, సోమాలియా దేశాలు కూడా ఈ ఏడాదితో సభ్యత్వాన్ని పూర్తి చేసుకుంటాయి. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వీటి సభ్యత్వం పూర్తవుతుంది. కొత్తగా రానున్న దేశాల సభ్యత్వం జనవరి 1, 2027 నుంచి డిసెంబర్ 31, 2028 వరకు కొనసాగుతుంది. భద్రతా మండలిలో కొత్తగా ఐదు దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. ఇందుకోసం ఏడు దేశాలు పోటీ పడ్డాయి. వీటిలో ఆస్ట్రియా, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వేలు నాలుగు స్థానాల్లో నిలిచాయి. మిగిలిన ఒక్క స్తానం కోసం కిర్గిస్తాన్, ఫిలిప్పైన్స్ మధ్య ఉత్కంఠ పోటీ నడిచింది. ఈ రెండు దేశాల సభ్యత్వం కోసం అదనంగా మూడు రౌండ్ల పోటీ నిర్వహించాల్సి వచ్చింది.చివరకు కిర్గిస్తాన్ గెలిచి, తొలిసారి సభ్యత్వం దక్కించుకుని చరిత్ర సృష్టించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events