కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పాస్‌పోర్ట్ సేవలను కుదించినట్లు రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం వెల్లడిరచింది. హైదరాబాద్‌లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈ నెల నుంచి 20 నుంచి 27వ తేదీ వరకు పాస్‌పోర్టు మేళ నిర్వహిస్తున్నట్లు రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి వెల్లడిరచారు. రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ పరిధిలోని పాస్‌పోర్ట్ సేవాకేంద్రం, పాస్‌పోర్ట్ లఘు కేంద్రం, పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కొవిడ్ నేపథ్యంలో పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్స్‌కు 75 శాతం మాత్రమే అనుమతిచ్చామని తెలిపారు.