Skip to main content

Namaste NRI

షూటింగ్ పూర్తి చేసుకున్నపింకీ.. విడుదల ఎప్పుడంటే?

వీఆర్‌పీ క్రియేషన్స్‌ పతాకంపై పి.పద్మావతి సమర్పణలో కిరణ్‌, మౌర్యాణి జంటగా నటిస్తున్న చిత్రం పింకీ. సీరపు రవికుమార్‌ దర్శకత్వం. పసుపులేటి వెంకటరమణ నిర్మిస్తున్నారు. సుమన్‌, శుభలేఖ సుధాకర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఫిలిం చాంబర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత తుమ్మపల్లి రామసత్యనారాయణ, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌, సాయి వెంకట్‌తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఫ్యామిలీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిదని దర్శకుడు తెలిపారు . ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: అమర్‌, సంగీతం చిన్నా, నిర్మాత: పసుపులేటి వెంకటరమణ, కథ-స్క్రీన్‌ ప్లే-డైలాగ్స్‌-దర్శకత్వం: సీరపు రవికుమార్‌.

Social Share Spread Message

Latest News