Skip to main content

Namaste NRI

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఏపీ మంత్రులు ఉన్నారు. రూ.4,727 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌‌ను నిర్మించారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనంలోని ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్‌ను ప్రధాని పరిశీలించారు.

ఈ వీడియో వాల్‌లో ప్రదర్శించిన వివిధ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర చరిత్రాక అంశాలను ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. విమానాశ్రయ ప్రాంగణంలోని వివిధ కళాకృతులను మోదీ ఆసక్తిగా పరిశీలించారు. టెర్మినల్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, జిఎంఆర్ ప్రతినిధులు ఫొటో దిగారు. ఓపెన్ టాప్ జీపులో వెళ్తూ 13,500 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన థింసా నృత్యాన్ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వీక్షించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events