Skip to main content

Namaste NRI

ప్రభాస్ ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌ వచ్చేసింది..విడుదల ఎప్పుడంటే !

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా హిస్టారికల్ వార్ డ్రామా ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌తో పాటు విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.2026 డిసెంబర్ 3 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అని ఒక కొత్త పోస్టర్ విడుదల చేశారు.

‘అజ్ఞాతపర్వం ముగిసింది ఇక తిరుగుబాటు మొదలైంది ‘ అంటూ వున్న ఈ పోస్టర్ లో 1932 నుండి మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు అని రాసి ఉన్న స్టాంప్ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ మునుపు ఎన్నడూ లేనివిధంగా ఫస్ట్ లుక్ లో కనిపించాడు..యుద్ధంలో ఒంటి నిండా రక్తంతో తుపాకీ పట్టుకుని కూర్చొని ఉన్న పోస్టర్ సినిమాపై పెంచేలా ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా లో ప్రభాస్ కి జోడీగా ఇమాన్ ఎస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తోంది. జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, రాజేష్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ చిత్రం నుండి ఓ లిరికల్ సాంగ్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events