Skip to main content

Namaste NRI

అవసరమైతే యుద్ధానికి సిద్ధం కిమ్‌

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతున్నది. మరోవైపు హమాస్‌ మిలిటెంట్‌లు-ఇజ్రాయెల్ సేనల మధ్య కూడా భీకర యుద్ధం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దక్షిణ కొరియా దేశం తో పునరేకీకరణకు తాను ఒప్పుకోబోనని, అవసరమైతే యుద్ధానికి సిద్ధం కావాలని కిమ్‌ తన సైన్యాన్ని ఆదేశించి నట్టు తెలుస్తున్నది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో డిసెంబర్ 26 నుంచి 30 వరకు జరిగిన పాలక వర్కర్స్ పార్టీ ప్లీనరీ సమావేశంలో కిమ్ మాట్లాడుతు  అవసరమైతే దక్షిణకొరియాపై అణు బాంబు వేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.

Social Share Spread Message

Latest News