కెనడా పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని జస్టిస్ ట్రుడోకు చెందిన లిబరల్ పార్టీయే మళ్లీ గెలిచింది. అయితే మెజారిటీకి 14 సీట్ల దూరంలో నిలిచిపోయింది. మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్న 49 ఏండ్ల ట్రుడో కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడం ద్వారా కెనడియన్ల మనసు గెలుచుకున్నారు. బహుశా అదే ఊపులో ఏకంగా రెండేండ్లు ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. కానీ లిబరల్ పార్టీ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 2019 కంటే ఒకటి తక్కువగా 156 సీట్లే గెలిచింది. విపక్ష కన్జర్వేటివ్ పార్టీ సరిగ్గా 2019 లో మాదిరిగానే 121 సీట్లలో గెలిచింది. కరోనా టైంలో ఎన్నికలేమిటన్న ఆగ్రహంతోనే ట్రుడోకు కెనెడియన్లు మెజారిటీ కట్టబెట్టలేదన్న ది పొలిటికల్ అనలిస్టుల మాట. రక్షణ మంత్రి హర్జిత్ సజ్జన్, మరో ఇద్దరు మంత్రులు అనితా ఆనంద్, బర్దిశ్ చగ్గర్‌తో పాటు ఈ ఎన్నికల్లో 17 మంది ఇండో కెనెడియన్లు కూడా గెలిచారు.
వాంకోరవ్ సౌత్ సీటును సజ్జన్ 49 శాతం ఓట్లతో ఓక్ విల్డే సీటును దక్కించుకున్నారు. అత్యధిక వ్యాక్సినేషన్ రేటున్న దేశాల్లో కెనడా టాప్ లో ఉండటం వెనక వ్యాక్సిన్ మినిస్టర్‌గా ఆమె కృషి చాలా ఉందని చెబుతారు. ఇక 41 ఏండ్ల చగ్గర్ వాటర్లూ నుంచి 44.8 శాతం ఓట్లతో గెలుపొందారు. కెనడా జనాభాలో ఇండియన్లు 3 శాతం అంటే 16 లక్షల మంది ఉన్నారు. 60 కోట్ల డాలర్ల ఖర్చుతో ఇవి కెనడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు నిలిచాయి.