అబుదాబి యువరాజు ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వచ్చే నెలలో భారత్‌లో పర్యటించను న్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదుపరి నాయకత్వం కోసం నహ్యాన్ పోటీదారుగా ఉన్నారు. తన పర్యట నలో భాగంగా భారతదేశం యుఏఈ మధ్య వాణిజ్యం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చల కోసం భారత్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది.
షేక్ ఖలీద్ సెప్టెంబర్ 8న భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ పర్యటనపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తన పర్యటనలో అబుదాబి యువరాజు ప్రధాని నరేంద్ర మోడీని, దేశ అగ్ర నాయక త్వాన్ని కలుస్తారని తెలుస్తోంది. ఈ పర్యటన రాబోయే దశాబ్దాలలో భవిష్యత్ సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై దృష్టి సారించనున్నది. భారత్, యుఏఈ మధ్య సంబంధాలు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి. ఈ పర్యటనలో ఆ పునాదిని మరింత బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దాల కోసం ఎదురుచూ డడం, యుఏఈ భవిష్యత్ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడంపై దృష్టి సారించ నున్నట్లు- అబుదాబి అధికారి ఒకరు తెలిపారు.