రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం రుణం రుధిరం). దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఉక్రెయిన్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేస్తూ తన టీమ్‌తో దర్శకుడు రాజమౌళి తీయించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ చారిత్రక ఇతివృత్తాలకు కాల్పనిక అంశాల్ని జోడిరచి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో నటించారు. ఆలియాభట్, ఒలీలియామోరిస్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో అజయ్‌దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలక పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించారు. దాదాపు 450 కోట్ల భారీ వ్యయంతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.