టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకున్న పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీవీ సింధును ఘనంగా సత్కరించారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలని ఆకాక్షించారు. ప్రభుత్వం తరపున పీవీ సింధుకు రూ.30 లక్షల నగదు బహమతిని మంత్రి ముత్తంశెట్టి అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవడం ఆనందంగా ఉందని పీవీ సింధు అన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవగా ఆయన ఆశీర్వదించారని తెలిపారు.