Skip to main content

Namaste NRI

చరిత్ర సృష్టించిన క్వాంటాస్‌

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నుంచి ఫ్రాన్స్‌లోని టౌలూస్‌ వరకూ ప్రయాణించిన ఎయిర్‌బస్‌ ఏ350-1000యూఎల్‌ఆర్‌ విమానం చరిత్ర సృష్టించింది. ఏకధాటిగా 24 గంటల 23 నిమిషాలు ప్రయాణించి, అత్యంత సుదీర్ఘ వాణిజ్య విమానయాన రికార్డును నెలకొల్పింది. క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ సన్‌రైజ్‌ లో భాగంగా ఈ టెస్ట్‌ ఫ్లైట్‌ విజయవంతమైంది.

మెల్‌బోర్న్‌లో జూలై 27న సాయత్రం బయలుదేరిన ఈ విమానం జూలై 28న ఫ్రాన్స్‌లోని ఎయిర్‌బస్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ఈ ప్రయాణంలో మొత్తం 23,075 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేసింది. 2025లో బోయింగ్‌ 777-200 ఎల్‌ఆర్‌ ద్వారా హాంకాంగ్‌- లండన్‌ మధ్య నమోదైన 22 గంటల 42 నిమిషాల రికార్డును ఇది అధిగమించింది.

Social Share Spread Message

Latest News