Namaste NRI

విదేశాలకు వెళ్లాలంటే క్యూఆర్ కోడ్… లేకపోతే వెనక్కు

విదేశాలకు వెళ్లాలంటే కోవిడ్‌ టెస్టు రిపోర్టు తప్పనిసరి. అయితే రిపోర్టుపై క్యూ.ఆర్‌ కోడ్‌ లేకపోతే చాలా విమానయాన సంస్థలు అనుమతించడం లేదు. విదేశాలకు వెళ్లే వారు 24 గంటల ముందు కొవిడ్‌ నిబంధనల మేరకు ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకోవాలి. అంతేకాకుండా వ్యాక్సిన్‌ వేసుకున్న రిపోర్టులు చూపించాల్సి ఉంటుంది. కొన్ని దేశాలు కనీసం ఒకసారి వ్యాక్సిన్‌ వేసుకున్నా సరే అంటున్నాయి. కానీ ఇక్కడే అందరూ తప్పులో కాలేస్తున్నారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టు రిపోర్టు, వ్యాక్సిన్‌ వేయించుకున్న సర్టిఫికెట్‌ ఉందన్న ధీమాతో నేరుగా ఎయిర్‌ పోర్టుకు వెళ్లిన వారు ఎయిర్‌ పోర్టులో విమానం ఎక్కలేక వెనక్కు మళ్లాల్సి వస్తోంది.

                 వ్యాక్సిన్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టు రిపోర్టుపై క్యూ.ఆర్‌ కోడ్‌ ఉండాలని విమానయాన సంస్థలు అడుగుతున్నాయి. టెస్టులు చేయించుకున్నా, వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి జాబితా ఐసీఎంఆర్‌ లో ఉంటుంది. అయితే  క్యూ.ఆర్‌ కోడ్‌ ఇవ్వడం లేదు.  మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం టెస్టులు చేయించుకున్నా వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి రిపోర్టులో క్యూ.ఆర్‌ కోడ్‌ ఇస్తున్నాయి. చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో, మొబైల్‌  టీమ్‌ల వద్ద టెస్టులు చేయించుకున్న వారికి, వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికి రిపోర్టులు వస్తున్నా అందులో క్యూ.ఆర్‌ కోడ్‌ లేక విమానం ఎక్కలేక వెనుదిరుగుతున్నారు. దేశీయంగా విమాన ప్రయాణాలకు క్యూ,ఆర్‌ కోడ్‌  గురించి పెద్దగా పట్టించుకోకున్నా, విదేశాలకు వెళ్లే వారిని మాత్రం తప్పనిసరిగా ఉండాలని పట్టుపడుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events