Skip to main content

Namaste NRI

నిర్మాత రాజ్ కందకూరి చేతుల మీదుగా రాధా మాధవం ఫస్ట్ లుక్ రిలీజ్

వినాయక్‌ దేశాయ్‌, అపర్ణా దేవి జంటగా నటిస్తున్న చిత్రం రాధా మాధవం. దాసరి ఇస్సాకు దర్శకుడు. గోనల్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ చిత్రంలో  మేక రామకృష్ణ, జయప్రకాష్‌, ప్రియ, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమా  ఫస్ట్‌లుక్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ గ్రామీణ నేపథ్య ప్రేమకథా చిత్రమిది. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయి. ప్రేమ ప్రయాణంలోని అనుభూతులకు అద్దం పడుతుంది అన్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.  ఈ చిత్రానికి కెమెరా: తాజ్‌ జీడీకే, సంగీతం: చైతు కొల్లి, కథ, మాటలు, పాటలు: వసంత్‌ వెంకట్‌ బాలా, దర్శకత్వం: దాసరి ఇస్సాకు.

Social Share Spread Message

Latest News