కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ, డల్లాస్లలో జరిగే పలు ముఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఇందులో టెక్సాస్ విశ్వవిద్యాలయం లో ఒక కార్యక్రమం జరుగనున్నది. రాహుల్ పర్యటనపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడా తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా నియామకమయ్యాక రాహుల్ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి.
రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయినప్పటి నుంచి ఆయనతో మాట్లాడాలని ఎన్నారైలు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రముఖులు, అంతర్జాతీయ మీడియా నుంచి చాలా అభ్యర్థనలు వచ్చాయని పిట్రోడా పేర్కొన్నారు. సెప్టెంబర్ 8న డల్లాస్లో, సెప్టెంబర్ 9-10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో ఉంటారని తెలిపారు. డల్లాస్లో టెక్సాస్ యూనివర్శి టీ విద్యార్థులతో, విద్యా సంఘం ప్రతినిధులతో కలిసి సంభాషించనున్నట్లు తెలిపారు. అలాగే, పలువురు సాంకేతిక నిపుణులను కలువనున్నట్లు తెలిపారు. రెండోరోజు వాషింగ్టన్ డీసీకి వెళ్తారని చెప్పారు. అక్కడ థింక్ ట్యాంక్స్, నేషనల్ ప్రెస్ క్లబ్తో పాటు పలువురితో సంభాషించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పర్యటన చాలా విజయవంతమవుతుందని భావిస్తున్నామన్నారు.