తేజస్ వీరమాచినేని, అక్షయ రోమి జంటగా నటిస్తున్న చిత్రం రాజా మార్కండేయ. వేట మొదలైంది ఉపశీర్షిక. బన్నీ అశ్వంత్ దర్శకుడు. శ్రీధర్ సామా, వెంకట్ గౌడ్ పంజాల కలిసి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటుడు సుమన్, నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వైశ్య ప్రముఖులు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ఇంకా గంగపురం పద్మగౌడ్, నవీన్ మాచర్ల అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. 90శాతం ఈ సినిమా చిత్రీక రణ పూర్తయిందని, అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి.