Skip to main content

Namaste NRI

అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రాజాకృష్ణ మూర్తికి.. అరుదైన అవార్డు 

అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రాజాకృష్ణ మూర్తికి డస్టింగ్‌గ్యూష్డ్‌ లీడర్‌షిప్‌ అవార్డు దక్కింది. ఇల్లినాయ్‌ రాష్ట్ర సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ జెస్సీ వైట్‌ ఆయన్ను ఈ అవార్డుతో సత్కరించారు. రాజా నిబద్ధతతో ప్రజాసేవ చేశారని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. గతంలో రాష్ట్ర అటార్నీ జనరల్‌ ఆఫీసులో స్పెషల్‌ అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఇక ప్రతినిధుల సభ సభ్యుడిగా ఆయన అనేక చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. విద్యా, కార్మిక సంక్షేమం, అభివృద్ధి, ప్రజారోగ్య కార్యక్రమాలపై ఆయన రూపొందించిన చట్టాలు పెను ప్రభావం చూపించాయి. న్యూఢల్లీిలో పుట్టిన కృష్ణమూర్తి చిన్నతనంతోనే కుటుంబంతో సహా అమెరికాకు వలసపోయిన విషయం తెలిసిందే. న్యూయార్క్‌ రాష్ట్రంలోని బఫెల్‌ ప్రాంతంలో ఆయన బాల్యం గడిచింది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన ప్రజా సేవలో నిమగ్నమయ్యారు.

Social Share Spread Message

Latest News