Namaste NRI

జై భీమ్ దర్శకుడితో రజినీకాంత్ కొత్త సినిమా అనౌన్స్

రజినీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై  సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జై భీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాత సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా  తలైవా  170వ సినిమా అనౌన్స్‌మెంట్  చేశారు. ఈ మేరకు వారు ఈరోజు మా చైర్మన్ సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా సూపర్స్టార్ ర‌జినీకాంత్‌గారి   తలైవా  170వ సినిమాను మా బ్యాన‌ర్‌లో   రూపొందించబోతున్నట్లు ప్రకటించటం ఆనందంగా ఉంది. టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. రాక్‌స్టార్  అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనున్నారు. జి.కె.ఎం. తమిళ్ కుమర‌న్‌గారి  నేతృత్వంలో త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను  ప్రారంభిస్తాం. అలాగే 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Social Share Spread Message

Latest News