Skip to main content

Namaste NRI

రజనీకాంత్‌ లాల్‌ సలామ్‌ టీజర్  

రజనీకాంత్‌ హీరోగా  నటిస్తున్న చిత్రం లాల్‌ సలామ్‌. విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్‌ ప్రధాన తారాగణం. క్రికెట్‌ లెజెండ్‌ కపిల్‌దేవ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకురాలు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. సోమవారం టీజర్ ను విడుదల చేశారు. ఇందులో మొయిద్దీన్‌ భాయ్‌గా తనదైన ైస్టెలిష్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు రజనీకాంత్‌. క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే భిన్న మతాలకు చెందిన ఇద్దరు యువకులు, వారి మధ్య తలెత్తే మతపరమైన సంవాదాల నేపథ్యంలో ట్రైలర్‌ సాగింది. మతాల మధ్య గొడవల్లో శాంతి కోసం మొయిద్దీన్‌ భాయ్‌ ఏం చేశాడనే అంశాన్ని ట్రైలర్‌లో చూపించారు. రజనీకాంత్‌ లుక్స్‌, ఆయన బాడీలాంగ్వేజ్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నది. ముంబయి డాన్‌గా రజనీకాంత్‌ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: విష్ణు రంగస్వామి, సంగీతం: ఏ.ఆర్‌.రెహమాన్‌, నిర్మాత: సుభాస్కరన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్‌.

Social Share Spread Message

Latest News