టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వచ్చిన రకుల్‌ను దాదాపు ఆరు గంటల పాటు విచారించారు. మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంక్ ఖాతాలను అధికారులు పరిశీలించారు. ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఎఫ్ క్లబ్ డ్రగ్స్ సరఫరా అయినట్లు కెల్వీన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ రకుల్‌కు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ సఫ్లై, ఎఫ్ క్లబ్ ఆర్థిక వ్యవహారాలు తదితర అంశాలపై ఈడీ అధికారులు రకుల్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
రకుల్‌ప్రీత్ సింగ్ ఆరో తేదీన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే షూటింగ్స్ ఉండటం వల్ల తాను హాజరు కాలేకపోతున్నానని, కాస్త గడువు ఇవ్వాలని ఈడీ అధికారులను రకుల్ కోరారు. అందుకు అంగీకరించని అధికారులు మూడు రోజుల ముందుగానే విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఆమె ముందుగానే ఈడీ ఎదుట హాజరయ్యారు.