భారత మూలాలున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం దీపావళి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. యూకేలోని తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ లో భార్య అక్షతా మూర్తి, ఇద్దరు కుమార్తెలతో కలిసి దీపాలు వెలిగించారు. పండుగ సందర్భంగా అక్షతా మూర్తి, ఇద్దరు కుమార్తెలు కృష్ణ, అనౌష్క సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకోవడం తనకు ఓ ప్రత్యేక క్షణం అని చెప్పారు. ఈ సందర్భంగా యూకే సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ రిషి సునాక్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.














