Skip to main content

Namaste NRI

యుకే ప్రధాని నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు…పాల్గొన్న రిషీ సునాక్‌ దంపతులు

యుకే ప్రధాని అధికారిక నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో ఉన్న డౌనింగ్‌ స్ట్రీట్‌లో జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని రిషి సునాక్‌, ఆయన సతీమణి అక్షతా మూర్తి  పాల్గొన్నారు. భార్య అక్షతా మూర్తితో కలిసి దీపాలు వెలిగించారు. వేడుకలకు హాజరైన హిందూ అతిథులను ప్రధాని సునాక్‌ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని అధికారిక నివాసం దీపాల కాంతులతో మెరిసిపోయింది.

ఈ నేపథ్యంలో ప్రధాని కార్యాలయం స్పందించింది. చీకట్లపై వెలుగు విజయానికి సూచిగా జరుపుకునే దీపవళి వేడుకలను డౌనింగ్‌ స్ట్రీట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ కమ్యూనిటీకి చెందిన అతిథులను ప్రధాని రిషి సునాక్‌ ఆహ్వానించారంటూ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. అందులో అక్షతా మూర్తితో కలిసి ఆయన దీపాలను వెలిగిస్తున్న ఫొటోలను షేర్‌ చేసింది. యూకేతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.

Social Share Spread Message

Latest News