Namaste NRI

కనెక్ట్ టు ఆంధ్రకి రూ.4 కోట్ల విరాళం

నాడు`నేడు పథకం రెండో విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 4 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్‌ టు ఆంధ్రకి లారస్‌ ల్యాబ్స్‌ రూ.4 కోట్ల విరాళం ఇచ్చింది. 3, 4 విడతల్లో అదే మండలాల్లోని  మిగిలిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను లారస్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులు కలిసి విరాళం చెక్కును, పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో డాక్టర్‌ చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ చావా కృష్ణ చైతన్య, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా నరసింహరావు కనెక్ట్‌ టు ఆంధ్ర సీవో వి.కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News