Skip to main content

Namaste NRI

దర్జా నుంచి వెళ్లిపోకే  పాటను విడుదల చేసిన సాగర్‌ చంద్ర

సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం దర్జా. ఈ సినిమలోని వెళ్లిపోకే అనే పాటను యువ దర్శకుడు, భీమ్లా నాయక్‌ ఫేమ్‌ సాగర్‌ కె చంద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాటతో పాటు విజులవ్స్‌ కూడా బాగున్నాయి అన్నారు.  నిర్మాత రవి పైడిపాటి మాట్లాడుతూ  విభిన్న కథా చిత్రమిది. నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఆమని, పృథ్వీ, ఆక్సాఖాన్‌, షమ్ము, అరుణ్‌వర్మ తదితరులు నటిస్తున్నారు. సలీమ్‌ మాలిక్‌ దర్శకుడు. పీఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శివశంకర్‌ పైడిపాటి నిర్మిస్తున్నారు. కామినేని శ్రీనివాస్‌ సమర్పకుడు. ఈ చిత్రానికి కెమెరా: దర్శన్‌, సంగీతం: రాప్‌ రాక్‌ షకీల్‌, కథ: నజీర్‌, మాటలు: పి.రాజేంద్రకుమార్‌, నజీర్‌, భవానీ ప్రసాద్‌, నిర్మాత: శివశంకర్‌ పైడిపాటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సలీమ్‌ మాలిక్‌. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రాప్‌రాక్‌ షకీల్‌, ఛాయాగ్రహకుడు దర్శన్‌, అక్సాఖాన్‌, పురుషోత్తపు బాబీ, రైటర్‌ భవానీ ప్రసాద్‌, షమ్ము, అరుణ్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News