Skip to main content

Namaste NRI

సాయిపల్లవి చెల్లె పూజా కన్నన్‌…అక్క కంటే ముందే

సాయిపల్లవి చెల్లెలు తొందరలోనే పూజా కన్నన్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. పండగపూట తన బాయ్‌ఫ్రెండ్‌ను పూజా కన్నన్‌ పరిచయం చేయడంతో ఈ విషయం బయటపడింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలను ఒక వీడియోను పూజా కన్నన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.  ఈ అందమైన లిటిల్‌ బటన్‌ నిస్వార్థంగా ఎలా ప్రేమించాలో నేర్పించాడు. ప్రేమలో ఓలా ఓపికగా ఉండాలో అతనే నేర్పించాడు. అతనే వినీత్‌. నిన్నటివరకు నా క్రైమ్‌ పార్టనర్‌ ఇప్పుడు నా పార్టనర్‌. ఐ లవ్‌యూ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.

తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేస్తూ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది చూసి పూజా కన్నన్‌ పెండ్లి ఫిక్సయ్యిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.  ఇక పూజా కన్నన్‌ విషయానికొస్తే సాయిపల్లవి తరహాలో ఈమె కూడా నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. చిత్తరాయి సెవ్వనం అనే తమిళ సినిమాలో లీడ్ రోల్‌ చేసింది. కానీ ఆ తర్వాత ఛాన్స్‌లు రాకపోవడంతో సినిమాలకు దూరమయ్యింది. సామాజిక సేవలో నిమగ్నమయ్యింది. ఇప్పుడు ఉన్నట్టుండి తన లవర్‌ను పరిచయం చేయడంతో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.సాయిపల్లవి ఫ్యాన్స్‌ అయితే ఒక్కసారిగా షాకయ్యారు. అక్క ఉండగానే చెల్లెలు పెండ్లికి రెడీ అయిపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారు.

Social Share Spread Message

Latest News