టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం. వెంకట్ బోయనపల్లి నిర్మాత. శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోండగా, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా మ్యూజికల్ అప్‌డేట్‌ను ఇచ్చింది.
దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. రాంగ్ యూసేజ్ అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు దీపావళి పండగా సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఇక సౌత్ ఇండియాలోని చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండనుంది. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో భారీ యాక్షన్ హంగులతో రూపొందిస్తున్నారు.














