Skip to main content

Namaste NRI

సలార్ కొత్త పోస్టర్.. ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్

ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం సలార్‌-1. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించారు. ఈ  చిత్రంలో  ప్పథ్వీరాజ్‌ సుకుమారన్‌, శృతిహాసన్‌, ఈశ్వరీరావు, జగపతిబాబు, శ్రియా రెడ్డి తదితరులు నటిస్తున్నారు.   ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌ను డిసెంబర్‌ 1న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో గన్‌ ఫైర్‌ చేస్తూ యాక్షన్‌ మోడ్‌లో కనిపిస్తున్నారు ప్రభాస్‌.  ట్రైలర్‌లో ప్రదర్శించే యాక్షన్‌ ఘట్టాలు హైలైట్‌గా ఉంటాయని, ప్రభాస్‌ పాత్ర తాలూకు ఆసక్తికరమైన అంశాన్ని కూడా రివీల్‌ చేయబోతున్నారని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబర్‌ 22న విడుదల చేయబోతున్నారు.

Social Share Spread Message

Latest News