Skip to main content

Namaste NRI

సీనియర్‌ సైంటిస్ట్‌ నల్లతంబి రికార్డు.. తొలిసారిగా సీఎస్‌ఐఆర్‌కు

శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా సీనియర్‌ సైంటిస్ట్‌ నల్లతంబి కలైసెల్వి నియక్తురాలు అయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.  సీఎస్‌ఐఆర్‌కు డైరెక్టర్‌ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలైసెల్వి రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఇథియమ్‌ అయాన్‌ బ్యాటరీలు రూపొందించడంలో కలైసెల్వి గతంలో మంచి ప్రతిభ కనబరిచారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ కార్యదర్శిగానూ ఆమె బాధ్యతలు నిర్వహిస్తారు.  నల్లతంబి కలైసెల్వి తమిళనాడు తిరునల్వేలి జిల్లా, అంబాసముద్రంలో జన్మించారు. ఆమె తమిళ మాద్యమంలో చదివారు. తాను తమిళంలో చదవడం వల్ల కళాశాలలో సైన్స్‌ భావనలను అర్థం చేసుకోగలిగానని చెపుతూ ఉంటారు. ఆమె 125 పరిశోధన పత్రాలను సమర్పించారు. ఆరు పేటెంట్లను పొందారు. అయాన్‌ బ్యాటరీస్‌ రంగంలో కృషి చేశారు.

Social Share Spread Message

Latest News