అమెరికాలోని టెక్సాస్‌లో వ్యభిచారం కేసులో తెలుగువారు అరెస్టయ్యారు. వ్యభిచారాన్ని నిరోధించే లక్ష్యంతో టెక్సాస్‌లోని డెంటాన్ కౌంటీ పోలీసులు ఈ నెల 14, 15 తేదీల్లో జరిపిన దాడుల్లో లైంగిక సేవలను పొందడా నికి వచ్చిన 21 మందిని అరెస్ట్ చేశారు. అందులో భారత్‌కు చెందిన ఏడుగురు విటులు కూడా ఉన్నట్టు డెంటాన్ కౌంటీ షరీఫ్ కార్యాలయం తెలిపింది.అరెస్టయిన వారిలో నిఖిల్ కుమ్మరి, గల్లా మోనిష్, కార్తీక్ రాయపాటి, నబీన్ శ్రేష్ఠ, అమిత్ కుమార్, జైకిరణ్ రెడ్డి మేకల ఉన్నారు. డెంటాన్ వాసులైన నిఖిల్ బండి, నిఖిల్ కుమార్‌లు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై అభియోగాలు నమోదు చేసినట్టు చెప్పారు. మిగిలిన ఐదుగురు విటులు లైంగిక సేవలు పొందడానికి రాగా, అరెస్ట్ చేశామన్నారు. వారి లో జైకిరణ్‌పై 18 ఏండ్లలోపు మైనర్‌తో వ్యభిచారానికి ప్రయత్నించినట్టు అదనపు అభియోగాలు నమోదు చేశారు.