అమెరికాలో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ దేశంలో మోదీ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోందని మరి హెచ్చరించింది. ఖలిస్థాన్ ఉగ్రవాద గ్రూపు సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) మోదీకి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24న మోదీ అమెరికా వెళ్తున్న సందర్భంగా ఆ సంస్థ ఇలా హెచ్చరించింది. వైట్‌హౌజ్ ముందు కూడా నిరసనలకు ప్రణాళికలు రచించింది. తొలిసారి ప్రత్యక్ష క్వాడ్ సమావేశంతో పాటు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పాల్గొనడానికి మోదీ అమెరికా వెళ్తున్న విషయం తెలిసిందే.
ఇండియాలో రైతులపై హింసకు వ్యతిరేకంగా తాము ఈ నిరసనలు చేపట్టనున్నట్టు ఎస్‌ఎఫ్‌జే చెప్పింది. ఆ ఉగ్రవాద గ్రూప్ జనరల్ కౌన్సిల్ గుర్పత్‌వంత్ సింగ్ పన్నన్ మాట్లాడుతూ అమెరికాలో తాను మోదీకి నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తానని అనడం గమనార్హం. అయితే ఈ గ్రూపుకు అంత సీన్ లేదని భద్రతా వర్గాలు చెబుతున్నాయి.