న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోకు ఓ మహిళ షాకిచ్చింది. గవర్నర్ దగ్గర పని చేసిన ఓ మహిళా ఉద్యోగి తనను లైంగికంగా వేధించినట్టు ఆరోపించిన విషయం తెలిసిందే. గవర్నర్ అధికార నివాసంలో తనపై చేతులు వేసి, అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజుల క్రితం న్యూయార్క్‌లో సంచలన అయ్యాయి. అనంతరం మరో 10 మంది మహిళలు కూడా ముందుకొచ్చి ఆండ్రూ క్యూమో చేసిన నీచమైన పనులను బయపెట్టారు. దీంతో ఈ ఆరోపణలపై విచారణ జరిగింది. ఆండ్రూ క్యూమో 11 మంది మహిళలను లైంగికంగా వేధించారని న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ తాజాగా ఇచ్చిన నివేదికలో తేల్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా స్పందించారు. గవర్నర్ పదవికి ఆండ్రూ క్యూమో రాజీనామా చేయాలని సూచించారు.