చిరు వ్యాపారులకు చేయూతను అందిద్దామని సినీ నటుడు సోనూసూద్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో హఠాత్తుగా ప్రత్యక్షమైన సోనూసూద్, అక్కడ ఉన్న ఒక జ్యూస్ సెంటర్ వద్దకు వచ్చారు. తనకు ఆరెంజ్ జ్యూస్ అంటే ఎంతో ఇష్టమని.. ఆ జ్యూస్‌ను స్వయంగా తయారు చేస్తానంటూ నిర్వాహకుడు హరీశ్ యాదవ్‌ని కోరారు. ప్రతీ ఒక్కరూ ఇలాంటి చిరు వ్యాపారులకు చేయూతగా నిలవాలని సోనూసూద్ పిలుపునిచ్చారు. తన అభిమాన నటుడు నేరుగా తన బండి వద్దకు వచ్చి జ్యూస్ తయారు చేయడంతో నిర్వాహకుడు హరీష్ యాదవ్ ఆనందంతో ఉబ్చి తబ్బిబ్బయ్యాడు.