విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొంది విడుదలైన చిత్రం ఎఫ్3. ఈ మూవీ గత నెల 27న గ్రాండ్‌గా విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా అన్ని సెంటర్ల నుంచి మంచి కలెక్షన్లు రాబట్టుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో రూ.52.01 కోట్ల షేర్ రాబట్టిందని తెలిసింది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ఎఫ్ 3 సినిమా రూ.100 కోట్ల వసూళ్లు సాధించిందన్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఇంత భారీ విజయం సాధించడం ప్రత్యేకంగా అనిపిస్తున్నది. మీరు ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి ఎఫ్ 4 కూడా రెడీ చేస్తున్నాం. త్వరలోనే ఆ సినిమాను ప్రకటిస్తాం అన్నారు. హీరో వెంకటేష్ మాట్లాడుతూ నా సూపర్ హిట్ చిత్రాలెన్నో వైజాగ్‌లో చేశాను. ఎఫ్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్‌కు ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ రెండు వందల మంది ఆర్టిస్టులు రెండేళ్ల పాటు పడిన కష్టం ఈ సినిమా. మా కష్టానికి మీరు నవ్వుతూనే ప్రతిఫలం ఇచ్చారు. వసూళ్లు, రికార్డులు ఇవ్వలేని సంతృప్తి మీరు సినిమాపై చూపించే ఆదరణతో దక్కుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు శ్రీనివాసరెడ్డి, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




























