Skip to main content

Namaste NRI

దీపావళికి స్పెషల్​ గుర్తింపు .. మిషిగన్ సెనేట్

హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే  పండుగ దీపావళి.  చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా యావత్ హిందూ సమాజం ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటుంది. అయితే, భారతదేశంలో ఉన్నవారు మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు సైతం దీపావళిని ఘనంగా నిర్వహిస్తారు. 

  ప్రేమ, కారుణ్యం, ఆశావాదానికి చిహ్నంగా దీపావళి పండుగకు విశిష్ట ప్రాధాన్యత ఉందని దానిని గుర్తించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని అమెరికాలోని మిషిగన్ సెనేట్ పేర్కొంది. రిపబ్లికన్ సెనేటర్ మైకేల్ వెబ్బర్ దీపావళిని గుర్తించవల్సిందిగా ప్రవేశపెట్టిన 79వ ప్రతిపాదనకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 100కోట్ల మందికి పైగా జరుపుకునే ఈ పండుగకు మిషిగన్ రాష్ట్ర సెనేట్ గుర్తింపు లభించడం పట్ల ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. సెనేటర్ వెబ్బర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events