Skip to main content

Namaste NRI

ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా శ్రీ చిదంబరం విడుదల

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న వింటేజ్‌ విలేజ్‌ డ్రామా శ్రీచిదంబరం. వినయ్త్న్రం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. నేటి యువత లో చాలా మంది చిన్నచిన్న సమస్యలకే సూసైడ్‌ దాకా వెళ్లిపోతున్నారని, అలాంటి వారిలో మార్పు తెచ్చే కథ ఇదని, మీ లోపమే మీ బలం అవ్వాలనే ఈ కథ చెబుతుందని ఆర్పీ పట్నాయక్‌ అన్నారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News