Skip to main content

Namaste NRI

శ్రీశ్రీశ్రీ రాజావారు వచ్చేది ఆ రోజే

నార్నే నితిన్‌ హీరోగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ శ్రీ శ్రీ శ్రీ రాజావారు. సంపద ఇందులో కథానాయిక. వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో చింతపల్లి రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌ 6న విడుదల కానుంది. వాణిజ్య విలువలతో కూడిన యూత్‌ఫుల్‌ ఎంటైర్టెనర్‌ ఇదని, గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథగా దర్శకుడు వేగేశ్న సతీశ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, మ్యాడ్‌, మ్యాడ్‌ స్వేర్‌, ఆయ్‌ చిత్రాలతో ఇప్పటికే హీరోగా హ్యాట్రిక్‌ అందుకున్న హీరో నార్నే నితిన్‌ కెరీర్‌లో ఇది మరో విజయంగా నిలుస్తుందని నిర్మాత తెలిపారు. రావు రమేశ్‌, నరేష్‌, రఘు కుంచె, ప్రవీణ్‌, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: దాము నర్రావుల, సంగీతం: కైలాష్‌ మీనన్‌, సమర్పణ: రంగాపురం రాఘవేంద్ర, మురళీకృష్ణ చింతపాటి.

Social Share Spread Message

Latest News