టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి శోభన్‌బాబు. ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ నటి సమంత సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ రోజు మనం చెప్పుకోబోయే చిత్రం.. అనే వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రేడియోలో కథ చెప్తున్నట్టుగా పాత్రలను పరిచయం చేసిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. నాయకానాయికల అల్లరి చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ శ్రీదేవి, శోబన్ బాబు కథ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమ్రన్ స్వరాలందిస్తున్నారు. నాగబాబు, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది మారుతి డైరెక్షన్‌లో మంచి రోజులొచ్చాయి సినిమాతో అందరినీ పలుకరించాడు సంతోష్ శోభన్. గౌరి జి.కిషన్ కథానాయిక. ప్రశాంత్ కుమార్ దర్శకుడు.














