Skip to main content

Namaste NRI

ఇలాంటి ఘటనలు సమాజానికి, ప్రభుత్వానికి.. మంచిది కాదు

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా పంజాబ్‌ హోం మంత్రి అట్టా తరార్‌ మాట్లాడుతూ  ఇలాంటి ఘనటలు జరుగడం సమాజానికి, ప్రభుత్వానికి మంచిది కాదని పేర్కొన్నారు. పంజాబ్‌ ప్రావిన్సులో ప్రతి రోజూ నాలుగైదు లైంగిక దాడి కేసులు నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిపారు. పౌర సమాజ, మహిళా హక్కుల సంఘాలు, టీచర్లు తదితరులను ఈ విషయంలో సంప్రదిస్తామని తెలిపారు. భద్రత విషయంలో పిల్లలకు అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. లైంగిక దాడి నిందితులను చాలామందిని ఇప్పటికే అరెస్టు చేశామని వెల్లడిరచారు. ఇందుకోసం ఎమెర్జెన్సీ విధించేందుకు యోచిస్తున్నట్టు ప్రకటించారు.

Social Share Spread Message

Latest News