Skip to main content

Namaste NRI

బహ్రెయిన్‌లో ఎన్నారై బీఆర్ఎస్‌ సెల్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

బహ్రెయిన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఎన్నారై బీఆర్ఎస్‌ సెల్ అధ్వర్యంలో   ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్‌.సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అధ్యక్షతన అండాలస్ గార్డెన్‌లో జరిగాయి. ఈ వేడుకల్లో కేకును కట్ చేసి ఆనందోత్సాలతో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సంధర్భంగా సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం చావు నోట్లో తల పెట్టి తెలంగాణను సాధించారు.కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ కు వచ్చిన పేరు ప్రతిష్టలు చూసి ఓర్వలేకనే రాజకీయ దురుద్దేశంతో కుట్ర పూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఎన్నారై బీఆర్ఎస్‌ బహ్రెయిన్ శాఖ ఖండిస్తుందన్నారు. కేసీఆర్‌ లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో  ఎన్నారై బీఆర్ఎస్‌ సెల్ బహ్రెయిన్ శాఖ ప్రధానకార్యదర్శిలు మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్,  కార్యదర్శులు, సంగేపు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, నాగుల లక్ష్మణ్, సంగేపు సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News