అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్, రష్యా, చైనా దేశాలపై విరుచుకుపడ్డారు. భారత్, చైనా, జపాన్, రష్యాలు జెనోఫోబిక్ (విదేశీయుల పట్ల విద్వేషం, భయం) దేశాలంటూ విమర్శించారు. భారత్ సహా ఆ దేశాలేవీ వలసదా రులను ఆమోదించటం లేదని, దీంతో ఆ దేశాల ఆర్థిక అభివృద్ధిని జెనోఫోబియా అడ్డుకుంటున్నదని అన్నారు. వాషింగ్టన్‌లో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమం లో ఆయన ప్రసంగిస్తూ, చైనా ఆర్థికం దారుణంగా మారింది. జపాన్ అనేక ఇ బ్బందుల్లో ఉంది. భారత్, రష్యా ఆర్థిక సమస్యల్లో ఉన్నాయి? ఎందుకంటే వాటికి జెనోఫోబిక్ ఉంది కాబట్టి. వలసదారులను అంగీకరించటం లేదు. వలసదారులతోనే దేశం మరింత బలోపేత మవుతుంది అని బైడెన్ చెప్పారు. అమెరికా వలసదారులకు ఆహ్వానం పలుకుతున్నది కాబట్టే, ఆర్థికంగా వృద్ధి సాధిస్తున్నది అని ఆయన అన్నారు.
