Namaste NRI

అందుకనే ఈ సినిమాకు ఆ టైటిల్‌ పెట్టాం:  సిద్ధు జొన్నలగడ్డ

సిద్ధు జొన్నలగడ్డ  హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం జాక్‌-కొంచెం క్రాక్‌. వైష్ణవి చైతన్య కథానాయిక. ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్‌ గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ప్రతి మనిషికి జీవితంలో ఓ లక్ష్యం ఉంటుంది. ఓ పనిని మనం ఎలా చేస్తున్నామన్నది చాలా ఇంపార్టెంట్‌. కొందరు డిఫరెంట్‌గా వాళ్ల టాస్క్‌ని కంప్లీట్‌ చేయాలని చూస్తారు. అలాంటి వారికి మనం క్రాక్‌ అంటుంటాం. అందుకనే ఈ సినిమా ఆ టైటిల్‌ పెట్టాం అన్నారు.  హీరో క్యారెక్టరైజేషన్‌ నచ్చి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని, ప్రేక్షకులను నవ్విస్తూనే బాధ్యతాయుతమైన పాత్రలో కనిపిస్తానని చెప్పారు. అన్ని వయసుల వారికి కనెక్ట్‌ అయ్యే కథాంశమిదని నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events