Namaste NRI

ది ఆర్చీస్‌ ట్రైల‌ర్ రిలీజ్

సుహానా ఖాన్, ఖుషీ కపూర్ , అగస్త్య నంద ప్రధాన పాత్రల్లో అరంగేట్రం చేస్తున్న చిత్రం ది ఆర్చీస్. బాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కురాలు జోయా అక్తర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ లో నేరుగా విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో పాటు టీజ‌ర్‌లు ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. రివ‌ర్‌డేల్ అనే ప్రాంతానికి చెందిన బెట్టీ, వెరోనికా తదితరుల జీవితంలో టీనేజీలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా రూపొందిన‌ట్లు తెలుస్తుంది. ఇక 1964 ఇయ‌ర్‌లో బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుంది. ది ఆర్చీస్ మూవీ డిసెంబ‌ర్ 07న నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల కానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events