Skip to main content

Namaste NRI

బుచ్చిబాబు సానా చేతుల మీదుగా బ్యాడ్ గాళ్స్ టీజర్ రిలీజ్

అంచల్‌ గౌడ, పాయల్‌ చెంగప్ప, రోహిణి, యష్ణ, రోహన్‌ సూర్య, మొయిన్‌ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం బ్యాడ్‌ గాళ్స్‌. కానీ చాలా మంచోళ్లు అనేది ఉపశీర్షిక. రేణు దేశాయ్‌ ప్రత్యేక పాత్ర పోషించారు. ఫణి ప్రదీప్‌ దూళిపూడి దర్శకుడు. శశిధర్‌ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్‌ నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా ఈ నెల 25న విడుదల కానున్నది.

ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. జాతిరత్నాలు, మ్యాడ్‌ లాంటి కామెడీ సినిమాలు అమ్మాయిలతో చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని దర్శకుడు ఫణిప్రదీప్‌ దూళిపూడి చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్లి గణేశ్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, నిర్మాణం: ప్రశ్విత ఎంటర్‌టైన్మెంట్‌, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్‌, ఎన్‌వీఎల్‌ క్రియేషన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events