Namaste NRI

అక్టోబరు 22న నాట్యం విడుదల

నాట్యం అంటే ఓ కథను నృత్యం ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ సినిమా ద్వారా కూచిపూడి డాన్సర్‌ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా, కాస్ట్యూమ్‌  డిజైనర్‌గా పరిచయం అవుతున్నారు. రేవంత్‌ కోరుకొండ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ అండ్‌ టీజర్‌కు ట్రెమండస్‌ రెప్పాన్స్‌ వచ్చింది. అలాగే ఇటీవల నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించిన ఈ సినిమాలో తొలి సాంగ్‌ నమ విశాయ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సినిమాను అక్టోబర్‌ 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో కమల్‌ కామరాజ్‌, రోహిత్‌ బెహల్‌, ఆదిత్య మీనన్‌, భానుప్రియ, శుభలేఖ సుధాకర్‌ ముఖ్య పాత్రధారులు. శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కరుణాకర్‌ ఆడిగర్ల సాహిత్యం అందించారు.

Social Share Spread Message

Latest News