వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఎఫ్ 3 చిత్రం షూటింగ్ మళ్లీ మొదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాస్తున్నారు. ఎఫ్ 2 సినిమాకు ఇది సీక్వెల్. ఎఫ్ 3 చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యారిజం, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేశారు. తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిత్ర తారాగణం అంతా పాల్గొననున్నారు. ఇందులో నటీ నటులు, టెక్నీషియన్స్ అందరి మొహాలపై చిరునవ్వుతో సెట్ అంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తోది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, సాయి శ్రీరామ్ కెమెరామోన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఎఫ్ 2ని 2019 సంక్రాంతికి విడుదల చేయగా, ఎఫ్ 3 చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.