నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ఆయ్. అంజి కంచిపల్లి దర్శకుడు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మెలోడీ ప్రధానంగా సాగే సూఫియానా అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను రామ్ మిర్యాల స్వరపరచడంతో పాటు సమీర భరద్వాజ్, రమ్యశ్రీతో కలిసి ఆలపించారు. శ్రీమణి సాహిత్యాన్నందించారు. గోదావరి అందాల నేపథ్యంలో చక్కటి సాహిత్యంతో కన్నుల పండువగా ఈ పాట సాగింది. ప్రేమికుల మదిలోని భావాలకు అద్దం పట్టే చక్కటి గీతమిదని, శ్రావ్యమైన బాణీతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. చిత్రీకరణ ఫూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సినిమా టోగ్రఫీ: సమీర్ కల్యాణి, సంగీతం: రామ్ మిర్యాల, సమర్పణ: అల్లు అరవింద్, దర్శకుడు: అంజి కంచిపల్లి.