Namaste NRI

దేవర నుంచి ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ దేవర. పాన్‌ ఇండియా స్థాయిలో మూవీ తెరకెక్కుతున్నది. ఈ మూవీలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ నటిస్తున్నది. ఇక సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.  ఈ  సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులోని ఎన్టీయార్‌ కేరక్టరైజేషనే ఈ పాట. తారక్‌ మాస్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా ఈ పాటను మలిచారు దర్శకుడు కొరటాల శివ. మాస్‌ ప్రేక్షకులకు విందుభోజనం లాంటి సినిమాగా దేవర తెరకెక్కుతున్నదని ఈ పాట చూస్తే అర్థమవుతుంది. అగ్గంటుకుంది సంద్రం.. ఆ గుండె మండే ఆకసం.. అరాచకాలు భగ్నం.. చల్లారే చెడు సాహసం.. అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, అనిరుథ్‌ రవిచంద్రన్‌ స్వరపరిచి, ఆలపించారు.

ఇందులోని హీరో గుణగణాలను, వీరత్వాన్ని తన సాహిత్యంతో అద్భుతంగా ఆవిష్కరించారు గీత రచయిత రామజోగయ్యశాస్త్రి. ఇక అనిరుథ్‌ సంగీతం మాస్‌ని ఉర్రూతలూగించేలా ఉంది. వెన్నెల్లో అందంగా కనిపించే సముద్రాన్ని రక్తసిక్తంగా చూపిస్తూ, తెగిపడిన శరీర భాగాలతో, దారుణమైన మారణాయుధాలతో ఆద్యంతం పోరాటాలతోనే ఈ పాట సాగింది. ఎన్టీయార్‌ మాస్‌ అవతార్‌ అభిమానులు పండుగ చేసుకునేలా ఉంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్‌, కొసరాజు హరికృష్ణ, సుధాకర్‌ మిక్కిలినేని కలిసి నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 10న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events