Skip to main content

Namaste NRI

హైదరాబాద్‌లో ఘనంగా ‘Global Telangana Association (GTA)మెగా కన్వెన్షన్ 2025’

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘GTA మెగా కన్వెన్షన్ 2025’ ఘనంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ‘ ఈ వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అక్షయ కన్వెన్షన్‌లో డిసెంబర్ 27, 28 తేదీల్లో రెండు రోజులపాటు ఈ వేడుకలు జరిగాయి.

త్రిదండి చినజీయర్ స్వామి, హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విరూపాపాక్ష విద్యారణ్య భారతి స్వామి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్,మాజీ మంత్రులు మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి , పడి రాకెష్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొని వేడుకలకు శోభ చేకూర్చారు.

GTA GTA ఫౌండర్ & గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి మాట్లాడుతూ ఈ వేడుక కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని అన్నారు. ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి వేలాది మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.

కన్వెన్షన్‌ నిర్వహణలో కీలకపాత్ర పోషించిన వారిలో ముఖ్యంగా GTA ఫౌండర్ & గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి, USA ఫౌండర్ చైర్మన్ విశేశ్వర్ రెడ్డి కల్వల, ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాడురి, ప్రెసిడెంట్ ఎలక్ట్ కంకణాల అభిషేక్ రెడ్డి, అడ్వైజరీ చైర్ ప్రతాప్ రెడ్డి పెండ్యాల, సహ వ్యవస్థాపకుడు శ్రవణ్ రెడ్డి పాడూరు, USA ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, వాషింగ్టన్ ప్రెసిడెంట్ రాము ముండ్రాతి ఉన్నారు.

కార్యక్రమం లో:100 మందికి పైగా కళాకారులతో తెలంగాణ జానపద & శాస్త్రీయ కళారూపాల ప్రదర్శనలు, మంగ్లీ లైవ్ మ్యూజికల్ నైట్, మోహన భోగరాజు ప్రత్యేక ప్రదర్శన, అహా ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఎంటర్‌టైమెంట్ షో,అతిథుల కోసం 35 రకాల నోరూరించే తెలంగాణ వంటకాలు ఏర్పాటు చేశారు.

రెండవ రోజు..
మాస్టర్‌క్లాసులు & చర్చలు జరిగాయి,రియల్ ఎస్టేట్, స్టార్టప్‌లు, ఎన్ఆర్ఐ లీగల్ అంశాలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలపై ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేశారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ కింద రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ భాగస్వామ్యం, పెట్టుబడుల ఆహ్వానం లాంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events