కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9, 12 తేదీల్లోని అన్ని పబ్లిక్ సర్వీసులను క్యాన్సిల్ చేసినట్టు ప్రకటించింది. అయితే ఈ రెండు రోజుల పాటు ఎమర్జెన్సీ కాన్సులర్ సర్వీసులు మాత్రం ఉంటాయని తెలిపింది. ఈ నెల 12న నీట్ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది దేశం వెలుపల కూడా తొలిసారిగా ఈ పరీక్షను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ అవకాశాన్ని కువైట్‌కు కేటాయించింది. దీంతో అక్కడ నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది.
కరోనా నేపథ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న తరుణంలో, ఇండియాకు వచ్చి నీట్ పరీక్ష రాయడం ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు కువైట్‌లో పరీక్షను నిర్వహించనుడం వల్ల అక్కడి విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. కువైట్‌లో ఉన్న భారత విద్యార్థులు అక్కడే నీట్ పరీక్ష రాసే వెసులుబాటు కలిగింది. భారత ప్రభుత్వం నిర్ణయం పట్ల మన విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.